Tv424x7
Telangana

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం… ఎందుకో తెలుసా..?

సూర్యాపేట :

జీతాలు ఇవ్వకపోవడంతో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.

సూర్యాపేట జిల్లా జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి మధుసూదన్ గత 5 నెలలుగా జీతం రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో మానసిక వేదనతో ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు

.ఆయన పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు వెంటనే సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు.

ఈ ఘటనతో జీతాల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల దుస్థితి మరోసారి వెలుగులోకి వచ్చింది.

Related posts

ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. మళ్లీ కస్టడీ పొడిగింపు

TV4-24X7 News

వ్యూహం’ సినిమా డిసెంబర్ 29న రిలీజ్

TV4-24X7 News

ఇంటర్ విద్యార్థిని అత్యాచారం, హత్యప్రేమ పేరుతో ఘోర ఘటన!

TV4-24X7 News

Leave a Comment