Tv424x7
Andhrapradesh

కల్తీ నెయ్యి తయారీ గ్యాంగ్ పట్టుబాటు..

విశాఖపట్నం పూర్ణామార్కెట్ సమీపంలో కల్తీ నెయ్యి తయారీ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. బళ్ళారి జిల్లాకు చెందిన వ్యక్తులు ఓ లాడ్జీలో గదులు అద్దెకు తీసుకుని నకిలీ నెయ్యి తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

సీజ్ చేసిన సొమ్ము:

108 కిలోల కల్తీ నెయ్యి

ప్యాకేజింగ్ మెటీరియల్

విక్రయానికి ఉపయోగించిన ఇతర సామాగ్రిఅధికారుల సమాచారం ప్రకారం, ఈ గ్యాంగ్ ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో కల్తీ నెయ్యి విక్రయాలు జరిపినట్లు నిర్ధారించారు. నమూనాలను పరీక్షల కోసం పంపగా, వీటి లోపల ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలు కలిపినట్లు అనుమానం వ్యక్తమవుతోంది.

వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని ఆహార భద్రతా విభాగం స్పష్టం చేసింది.

Related posts

ప్రీపెయిడ్ మీటర్లు వచ్చేస్తున్నాయ్..ఇక ముట్టుకుంటే షాక్..

TV4-24X7 News

తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న విల్లూరి భాస్కర్ రావు మరియు బొత్స రామ్ రెడ్డి

TV4-24X7 News

లంచం తీసుకుంటూ దొరికిపోయిన మున్సిపల్ కమిషనర్

TV4-24X7 News

Leave a Comment