హైదరాబాద్:
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డిఆర్ఐ (Directorate of Revenue Intelligence) అధికారులు పెద్ద ఎత్తున గంజా పట్టివేత చేశారు. దుబాయ్ నుండి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేసిన అధికారులు, అతడి బ్యాగేజ్‌లో భారీగా నిషేధిత మాదక ద్రవ్యాలను గుర్తించారు.
తనిఖీలో 12 కిలోల హైడ్రోపోనిక్ గాంజా బయటపడింది. దీని అంచనా విలువ సుమారు రూ.12 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడిపై కేసు నమోదు చేశారు.
ప్రయాణికుడు గంజాను దాచిపెట్టి భారత్‌లోకి తరలించే ప్రయత్నం చేసినట్లు డిఆర్ఐ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ రవాణా వెనుక ఉన్న రాకెట్‌పై పూర్తి స్థాయి విచారణ ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ కేసు అంతర్జాతీయ డ్రగ్ రాకెట్లకు సంబంధించినదిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

