Tv424x7
Crime NewsTelangana

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 12 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గాంజా పట్టివేత

హైదరాబాద్‌:

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డిఆర్ఐ (Directorate of Revenue Intelligence) అధికారులు పెద్ద ఎత్తున గంజా పట్టివేత చేశారు. దుబాయ్ నుండి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేసిన అధికారులు, అతడి బ్యాగేజ్‌లో భారీగా నిషేధిత మాదక ద్రవ్యాలను గుర్తించారు.

తనిఖీలో 12 కిలోల హైడ్రోపోనిక్ గాంజా బయటపడింది. దీని అంచనా విలువ సుమారు రూ.12 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడిపై కేసు నమోదు చేశారు.

ప్రయాణికుడు గంజాను దాచిపెట్టి భారత్‌లోకి తరలించే ప్రయత్నం చేసినట్లు డిఆర్ఐ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ రవాణా వెనుక ఉన్న రాకెట్‌పై పూర్తి స్థాయి విచారణ ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ కేసు అంతర్జాతీయ డ్రగ్ రాకెట్లకు సంబంధించినదిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Related posts

కిరాణ వర్తక సంఘం ఆధ్వర్యంలో కోటి తలంబ్రాల దీక్ష :నిర్వహించిన రామకోటి సంస్థ

TV4-24X7 News

ఆ మాటలు నమ్మొద్దు: మంత్రి శ్రీధర్ బాబు

TV4-24X7 News

గచ్చిబౌలి భూముల వివాదానికి చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు….రంగంలోకి మంత్రుల బృందం?

TV4-24X7 News

Leave a Comment