కడప/మైదుకూరు :దువ్వూరు మండలం :దువ్వూరు మండలంలోని ఉల్లి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల కారణంగా ఉల్లి పంట పూర్తిగా దెబ్బ తింది. మార్కెట్‌లో ధరలు కూడా పతనమవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.రైతుల వివరాల ప్రకారం మండలంలో దాదాపు 1000 ఎకరాలకు పైగా పెద్ద బళ్లారి ఉల్లి సాగు జరిగింది. ఒక్క ఎకరా సాగుకు ₹50 వేల నుంచి ₹75 వేల వరకు పెట్టుబడి పెట్టినట్లు వారు తెలిపారు. అయితే వరుస వర్షాలతో పంట నష్టపోవడంతో పాటు మార్కెట్ ధరలు కూడా పడిపోవడం రైతులకు పెద్ద దెబ్బగా మారింది.రైతులు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రకటించిన పరిహారం కేవలం కర్నూలు జిల్లా రైతులకు మాత్రమే అందుతుందని, అదే విధంగా తమకు కూడా పరిహారం అందేలా చూడాలని కోరుతున్నారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ విషయంలో స్పందించిన మైదుకూరు ఉద్యానవన శాఖ అధికారి రామకృష్ణ మాట్లాడుతూ, ఉల్లి పంట నష్టాల వివరాలను జిల్లా ఉన్నతాధికారులకు ఇప్పటికే అందజేశామని, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్లామని వెల్లడించారు.
previous post
next post

