Tv424x7
Andhrapradesh

డిగ్రీ కాలేజీల బంద్!!

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు ఆందోళనకు దిగాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% డిగ్రీ కాలేజీలు బంద్ ప్రకటించాయి.

యాజమాన్యాల అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం, గత 16 నెలలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కాలేదని, దీంతో కాలేజీల నిర్వహణ తీవ్రంగా కష్టాల్లో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఈ నెల 27వ తేదీ వరకు బంద్ కొనసాగుతుందని హెచ్చరించారు. అంతేకాకుండా, అక్టోబర్ 6 నుంచి విజయవాడలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ఈ పరిణామాలతో విద్యార్థులు, అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యపై ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.

Related posts

అన్న సమారాధనకు 15 వేలు విరాళం అందజేసిన వాసుపల్లి

TV4-24X7 News

క్వీన్ మేరీ హై స్కూల్ లో ఆడిటోరియం షెడ్ ను ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

మంగళగిరి పట్టణంలో భారీగా మద్యం స్వాధీనం

TV4-24X7 News

Leave a Comment