Tv424x7
Andhrapradesh

తమిళనాడులో ఏపీ యువతిపై కానిస్టేబుళ్ల అత్యాచారం

తిరువణ్ణామలై :

తమిళనాడులో మరో అమానుష ఘటన వెలుగుచూసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతిపై ఇద్దరు కానిస్టేబుళ్లు దారుణంగా అత్యాచారం చేశారు.

నిన్న రాత్రి తిరువణ్ణామలై సమీపంలోని ఎంథాల్ బైపాస్ రోడ్డుపై వెళ్తున్న వాహనాన్ని సుందర్ రాజ్, సురేష్ రాజ్ అనే కానిస్టేబుళ్లు ఆపారు. వాహనంలో ఉన్న వారిని అనుమానాస్పదంగా ప్రశ్నించిన పోలీసులు, అక్కడున్న లక్ష్మి అనే యువతిని కొట్టి, అత్యాచారం చేసి రోడ్డుపక్కన వదిలి పరారయ్యారు.

తెల్లవారుజామున 4 గంటల సమయంలో గ్రామస్తులు ఆ యువతిని గుర్తించి వెంటనే తిరువణ్ణామలై మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలికి చికిత్స అందుతున్నది.ఇక నిందితులుగా ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి రహస్య ప్రదేశంలో విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Related posts

ఈస్ట్ ఏసీపీగా లక్ష్మణమూర్తి బాధ్యతలు

TV4-24X7 News

కడప విమాన సర్వీసుల వివరాలు

TV4-24X7 News

అసెంబ్లీలో అవమానాన్ని భరించలేకపోయా :చంద్రబాబు

TV4-24X7 News

Leave a Comment