Tv424x7
Andhrapradesh

ఘనంగా అమ్మవారి ప్రతిష్ట విగ్రహ దాత: మహేశ్వర్ రెడ్డి సుబ్బమ్మ దంపతులు

నంద్యాల జిల్లా, నంద్యాల పట్టణంలోని, విశ్వ నగర్ కాలనీలోని సాయిబాబా గుడి ఆవరణం నందు దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి విగ్రహ ప్రతిమను ప్రతిష్టించడం జరిగినది. ప్రతిరోజు అమ్మవారు ఒక్కొక్క అవతారంలో కమిటీ పెద్దలతో, భక్తులతో పూజలు అందుకుంటూ కొలువుతీరినది. ఈ సందర్భంగా కమిటీ పెద్దలు మాట్లాడుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు పడి రైతులకి పంటలు బాగా పండాలని, వ్యాపారస్తులు సంతోషంగా ఉండాలని, ప్రతి ఒక్క హిందువు హిందు ధర్మాన్ని పాటించాలని అన్నారు. ప్రతి ఒక్క హిందువు చత్రపతి శివాజీ చరిత్రను గుర్తు చేసుకోవాలని అన్నారు. అమ్మవారికి కమిటీ పెద్దలు, భక్తాదులు అందరూ నియమ పద్ధతులతో చల్లని తల్లికి పూజలు చేయడం జరిగినది. ఈ సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం భక్తాదులందరికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగినది. భక్తాదులందరు విరివిగా పాల్గొని భోజనాల కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో కమిటీ పెద్దలు, భక్తాదులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాజ్‌ భవన్‌లో ‘ఎట్‌ హోం’ కార్యక్రమం

TV4-24X7 News

వాసుపల్లి కి విజయ దశమి శుభాకాంక్షలు తెలిపిన ముజీబ్ ఖాన్

TV4-24X7 News

ఏపీ టెన్త్‌ విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు పెంపు!

TV4-24X7 News

Leave a Comment