కడప/దువ్వూరు మండల కేంద్రంలో “సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ – జిఎస్టి 2.0” అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీఎస్టీవో రవి కిషన్, మండల వ్యవసాయ అధికారి అమర్నాథ్ రెడ్డి, ఉద్యానవన అధికారి రామకృష్ణ, వెటర్నరీ, ఏపీఎంఐపి మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా జీఎస్టీవో రవి కిషన్ మాట్లాడుతూ – “వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన సూక్ష్మ పోషకాలు, వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు, ఎరువుల ముడిసరుకులపై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గించాం. దీని వలన రైతుల పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది” అని తెలిపారు.మండల వ్యవసాయ అధికారి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ – “ఎరువుల ముడి సరుకులపై 18% నుంచి 5% కు, సూక్ష్మపోషకాలపై 12% నుంచి 5% కు, అలాగే ట్రాక్టర్లు మరియు వ్యవసాయ పరికరాలపై 12% నుంచి 5%కు జీఎస్టీ తగ్గింపు జరిగింది. దీనివల్ల ఎరువుల ధరలు తగ్గి, రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది” అని వివరించారు.ఈ సమావేశంలో గ్రామ వ్యవసాయ సహాయకులు చరణ్, రైతులు పాల్గొన్నారు.
previous post

