Tv424x7
Andhrapradesh

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నంద్యాల రైతునగర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.పండుగ పూట దారుణం…లారీ ,ఆటో డి.ఇద్దరు మృతి

నలుగురికి తీవ్ర గాయాలు. నంద్యాల పట్టణం రైతునగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా,నలుగురికి గాయాలైనట్టు సమాచారం.వివరాల్లోకి వెళితే నూనెపల్లి నుంచి చాకరాజు వేముల వెళ్తున్న ఆటోను అటు నుంచి వస్తున్న లారీ వేగంగా ఆటోను ఢీకొట్టడం జరిగింది .ఆటోలో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. ఆటోలో ఇద్దరు మహిళలు నలుగురు పురుషులు ప్రయాణిస్తున్నారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడాని తెలిసింది. ఈ సంఘటన నూనెపల్లె బ్రిడ్జి దిగిన తర్వాత భగత్ సింగ్ కాలనీ దగ్గర ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఆటోను ఢీకొని అతివేగంగా నంద్యాల వైపు సాయిబాబా నగర్ రోడ్డులోకి జనాల మీదికి రావడం జరిగింది అని ప్రజలు పేర్కొంటున్నారు. అక్కడ ఉన్న స్థానికులు రాలేదేవరను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధితులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం అందించారు. బాధితుల నుంచి సిఐ కంబగిరి రాముడు వివరాలు సేకరిస్తున్నారు.

Related posts

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి దుమారం.. ఏఆర్ డైరీలో ఫుడ్ సేప్టీ అధికారులు తనిఖీలు

TV4-24X7 News

బైరి నరేష్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ మావోయిస్ట్ పార్టీ లేఖ

TV4-24X7 News

షర్మిలకు ఈసీ నోటీసులు..

TV4-24X7 News

Leave a Comment