ప్రొద్దుటూరు పట్టణంలో జరుగుతున్న ఎగ్జిబిషన్‌లో నిర్వహకులు మున్సిపల్ గెజిట్ ప్రకారం అమలు చేయాల్సిన ధరలకంటే అధిక ధరలు వసూలు చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిక రేట్లతో సామాన్య ప్రజలపై దోపిడీ జరుగుతోందని ఆరోపిస్తూ ప్రొద్దుటూరు పట్టణ వాసి నేడు మున్సిపల్ చైర్మన్ శ్రీమతి భీమునిపల్లి లక్ష్మీదేవి గారికి, మున్సిపల్ కమిషనర్ రవి చంద్రా రెడ్డి గారికి ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ఆయన, ఎగ్జిబిషన్ నిర్వహకులు అనుమతులు పొందినప్పుడు నిర్ణయించిన ధరలకు కట్టుబడి లేకుండా అదనపు వసూళ్లు చేస్తున్నారని, వెంటనే ఈ సమస్యను పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు.

