Tv424x7
Andhrapradesh

తురకపాలెం పరిసరాల్లో యురేనియం అవశేషాల కలకలం…

తురకపాలెం పరిసరాల్లో యురేనియం అవశేషాలు వెలుగులోకి వచ్చాయి. చెన్నై ప్రయోగశాలలో నిర్వహించిన నీటి నమూనాల పరీక్షల్లో ఈ విషయాలు బయటపడ్డాయి.

ప్రాథమిక నివేదికల ప్రకారం, స్థానిక ప్రజల్లో ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్న అనారోగ్య సమస్యలకు ఈ యురేనియం అవశేషాలే కారణమని నిపుణులు భావిస్తున్నారు. తురకపాలెం క్వారీ గుంటలలో నిల్వ ఉన్న నీటిలో అధికంగా యురేనియం ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ పరిణామంతో గ్రామస్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందేమోనని భయాందోళన వ్యక్తమవుతోంది.

దీనిపై జిల్లా అధికారులు, కాలుష్య నియంత్రణ బోర్డు, భూగర్భ జలవిభాగం జట్టు పరిశీలన జరపనుందని సమాచారం.

Related posts

విశాఖపట్నం లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ తనిఖీలు

TV4-24X7 News

తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ సేవలకు ఆటంకం”!

TV4-24X7 News

అనంతపురం జిల్లా A.నారాయణపురం పంచాయతీలో “డ్రగ్స్ వద్దు బ్రో” అవగాహన కార్యక్రమం విజయవంతం!!

TV4-24X7 News

Leave a Comment