Tv424x7
Andhrapradesh

గుంటూరులో భారీ వర్షం – రహదారులు జలమయం…

గుంటూరు

గుంటూరు నగరంపై ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం కారణంగా రహదారులు జలమయమయ్యాయి.

బృందావన్‌ గార్డెన్స్‌, ఏటి అగ్రహారం, పట్టాభిపురం, బ్రాడీపేట, గుజ్జనగుండ్ల, విద్యానగర్ వంటి ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లను ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

బృందావన్‌ గార్డెన్స్‌లో ఓ కారుపై పెద్ద చెట్టు విరిగిపడింది. అయితే అదృష్టవశాత్తూ కారులో ఉన్నవారికి ప్రాణాపాయం తప్పింది. భారీ వర్షంతో నగరంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగగా, వాహనదారులు గంటల తరబడి ఇరుక్కుపోయారు.

పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. మునిసిపల్‌ సిబ్బంది నీటిని వెలికితీసే పనులు ప్రారంభించారు. వర్షం మరికొన్ని గంటలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Related posts

ఏపీ లిక్కర్ స్కాంలో ఈ ముగ్గురే కీలక నిందితులు

TV4-24X7 News

విజయవాడ BRTS రోడ్డులో ఉద్రిక్తత…. ఏంటో తెలుసా.

TV4-24X7 News

నేషనల్ సేవరత్న అవార్డు అందుకున్న సమ్మిరెడ్డి కృష్ణారెడ్డి, అంకిరెడ్డి మేరీ.

TV4-24X7 News

Leave a Comment