Tv424x7
Andhrapradesh

అనంతపురం జిల్లా A.నారాయణపురం పంచాయతీలో “డ్రగ్స్ వద్దు బ్రో” అవగాహన కార్యక్రమం విజయవంతం!!

గౌరవనీయులు ఈగల్ ఐజీపీ శ్రీ ఆకే రవికృష్ణ IPS గారి ఆదేశాల మేరకు, మరియు అనంతపురం జిల్లా గౌరవ పోలీస్ సూపరింటెండెంట్ పి. జగదీష్ IPS గారి సూచనల ప్రకారం నిన్న A.నారాయణపురం పంచాయతీలో “డ్రగ్స్ వద్దు బ్రో” అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో ఈగల్ సెల్ అనంతపురం sub-inspector హనుమంతు గారు, ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులు, అలాగే గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రజలకు ఈగల్ విభాగం కార్యకలాపాలు, డ్రగ్స్ నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం గురించి వివరాలు ఇవ్వబడ్డాయి. అదేవిధంగా, ఏవైనా మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం ఫ్రీ కాల్ నంబర్ 1972 ద్వారా అందించవచ్చని సూచన ఇచ్చారు.

ప్రజలు ఈగల్ సామాజిక మాధ్యమాలు QR కోడ్ ద్వారా స్కాన్ చేసి అధికారిక పేజీని ఫాలో అయ్యారు. గ్రామస్తులు ఉత్సాహంగా “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదాలను పలికి, డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాల్లో తమ పూర్తి సహకారాన్ని హామీ ఇచ్చారు.

Related posts

ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఉచిత ఇస్త్రీ బండ్ల పంపిణీ!!

TV4-24X7 News

ఏపీలో మెగా డీఎస్సీ.. ఇంకా 3 రోజులే ఛాన్స్**ఇప్పటికే 3 లక్షలు పైగా దాటిన అప్లికేషన్లు

TV4-24X7 News

ఆర్మీ, నేవీ చీఫ్‌లుగా స్నేహితులు

TV4-24X7 News

Leave a Comment