Tv424x7
Andhrapradesh

వాహనమిత్ర మార్గదర్శకాలు – ఎప్పటి నుంచి అమలు తెలుసా..?

ఏపీలో వాహనమిత్ర పథకం అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.

సెప్టెంబర్ 17 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కొత్త దరఖాస్తులు స్వీకరించనున్నారు.

ముఖ్య నిబంధనలు :

ఏపీలో రిజిస్ట్రేషన్, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరి.ఆటో రిక్షా, లైట్ మోటార్ వాహనాలు నడపడానికి అనుమతించే లైసెన్సు ఉండాలి.

వాహనం ఏపీలోనే రిజిస్టర్ అయి ఉండాలి.

మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ యజమానులకు RC, ఫిట్నెస్ వంటి సర్టిఫికెట్లు తప్పనిసరి.

ఆటో రిక్షా యజమానులు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోయినా 2025–26 సంవత్సరానికి తాత్కాలిక అనుమతి, ఒక నెలలోపు సర్టిఫికెట్ పొందాలి.

బీపీఎల్/రేషన్ కార్డు కలిగినవారే అర్హులు.ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అర్హులు కారరు. (పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు)ఇంటి విద్యుత్తు వినియోగం నెలకు సగటున 300 యూనిట్ల లోపు ఉండాలి.

వాహనాలపై పెండింగ్ బకాయిలు, చలాన్లు ఉండకూడదు.మాగాణి భూమి 3 ఎకరాల లోపు, మెట్ట భూమి 10 ఎకరాల లోపు ఉండాలి.

పట్టణాల్లో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస/వాణిజ్య నిర్మాణం ఉండకూడదు.

ఇప్పటికే 2023–24లో ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారుల వివరాలు సమీక్షించనున్నారు.

Related posts

మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం

TV4-24X7 News

రాజధాని ఫైల్స్’ సినిమా రిలీజ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

TV4-24X7 News

సూపర్ సిక్స్ సక్సెస్‌ఫుల్ హిట్.. పండుగ రోజే 82% ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ పూర్తి..

TV4-24X7 News

Leave a Comment