హైదరాబాద్ పెద్ద అంబర్‌పేట్‌లో బుధవారం పోలీసులు భారీగా గంజాయి పట్టుబట్టారు. విశాఖపట్నం నుంచి రాజస్థాన్‌కు తరలిస్తున్న 400 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
స్మగ్లర్లు ఎవరికీ అనుమానం రాకుండా కొబ్బరి బొండాల్లో గంజాయి దాచిపెట్టి తరలిస్తుండగా, ఈగిల్ బృందం చాకచక్యంగా గుర్తించింది.
👉 ఈ ఆపరేషన్‌లో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, ఒక డీసీఎం వాహనం, కారు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
🔸 కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

