టోక్యో,
జపాన్‌లో శనివారం అర్థరాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం కారణంగా ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ భూకంపం హోన్షు తూర్పు తీరానికి సమీపంలో సంభవించింది. భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు.
ఇప్పటివరకు ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియరాలేదు.
అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ, అవసరమైన సాయం అందించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
తీర ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. విద్యుత్ సరఫరా మరియు రవాణా వ్యవస్థపై ప్రభావం పడినట్లు సమాచారం.

