Tv424x7
Telangana

కుక్‌గా పని చేస్తూ డ్రగ్స్ స్మగ్లింగ్: మాజీ NSG కమాండో అరెస్ట్…

హైదరాబాద్, :

దేశాన్ని ఉలిక్కిపడిన ముంబై 26/11 ఉగ్రదాడుల సమయంలో వీరోచితంగా పోరాడిన మాజీ NSG కమాండో ఇప్పుడు డ్రగ్స్ స్మగ్లింగ్‌ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

సమాచారం ప్రకారం, అతను హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ హోటల్‌లో కుక్‌గా పని చేస్తూ, రహస్యంగా మాదకద్రవ్యాల రవాణా నిర్వహించేవాడు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ఈ విషయం గురించి గమనించి, ప్రత్యేక నిఘా పెట్టి అతడిని పెద్ద ఆపరేషన్‌లో అదుపులోకి తీసుకుంది.

తన వద్ద నుంచి గంజాయి, కొకైన్, హెరాయిన్ వంటి నిషేధిత మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.ఒకప్పుడు దేశ రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన కమాండో, ఇప్పుడు డ్రగ్ మాఫియా నెట్‌వర్క్‌లో చిక్కి దేశంలో తీవ్ర చర్చకు కారణమయ్యాడు.

Related posts

హయత్ నగర్ గంజాయి మూకల వీరంగం…

TV4-24X7 News

కేంద్ర మంత్రితో సమావేశంకానున్న భట్టి విక్రమార్క.

TV4-24X7 News

ఎక్సైజ్ కానిస్టేబుల్ తాటి వీరస్వామి మృతి!!

TV4-24X7 News

Leave a Comment