Tv424x7
National

మధ్యప్రదేశ్, రాజస్థాన్లో పిల్లల మృతి అనంతరం కోల్డ్ రిఫ్ దగ్గు సిరప్‌పై నిషేధం — కేరళ ప్రభుత్వ నిర్ణయం..

మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో 11 మంది పిల్లలు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడంతో, ఆ ఘటనకు “కోల్డ్ రిఫ్” దగ్గు సిరప్‌కు సంబంధం ఉందనే అనుమానాలపై కేరళ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది.

ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించిన వివరాల ప్రకారం — రాష్ట్రవ్యాప్తంగా “కోల్డ్ రిఫ్” సిరప్‌ విక్రయాలు, పంపిణీ తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్‌లో ఉన్న స్టాక్‌ను ఉపసంహరించుకునేలా సూచనలు పంపినట్లు ఆమె తెలిపారు.

ఈ సిరప్‌ను 8 మంది పంపిణీదారుల ద్వారా విక్రయిస్తున్నట్లు గుర్తించగా, వారందరికీ సరఫరా నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.

👉 పిల్లల ప్రాణాలకు ప్రమాదం కలగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Related posts

భారత్లో మరో నాలుగు యాపిల్ రిటైల్ స్టోర్లు

TV4-24X7 News

సమాచారం ఇవ్వని అధికారులపై పోలీసు కేసు పెట్టవచ్చు : రాష్ట్ర సమాచార కమిషన్

TV4-24X7 News

సీఏఎఫ్‌ కమాండర్‌ మృతి.. గొడ్డలితో నరికి చంపిన మావోయిస్టులు

TV4-24X7 News

Leave a Comment