Tv424x7
Telangana

ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య…

📍 తెలంగాణ – చర్లపల్లి పీఎస్ పరిధికుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.

పోలీసుల వివరాల ప్రకారం – మధుసూదన్ రెడ్డినగర్‌కు చెందిన బత్తుల గోపాల్, ప్రసన్న దంపతులు విడాకులు తీసుకున్నారు.

ఈ దంపతుల కుమార్తె సృష్టిత (21) తల్లితో కలిసి నివసిస్తూ ఉండేది. కుటుంబ పరిస్థితుల వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, శుక్రవారం తన గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

సృష్టిత తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Related posts

కొడుకు నిర్లక్ష్యంతో విసిగి రూ.3 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి దానం చేసిన మాజీ ఎంపీపీ

TV4-24X7 News

సంగారెడ్డి జిల్లాలో పోలీసు సిబ్బంది ఆర్థిక ఇబ్బందులుబకాయిల చెల్లింపుల్లో ఆలస్యం..

TV4-24X7 News

కేంద్ర హోం సహాయ మంత్రి ఇల్లు ముట్టడించిన విద్యార్థి సంఘాలు

TV4-24X7 News

Leave a Comment