📍 తెలంగాణ – చర్లపల్లి పీఎస్ పరిధికుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం – మధుసూదన్ రెడ్డినగర్‌కు చెందిన బత్తుల గోపాల్, ప్రసన్న దంపతులు విడాకులు తీసుకున్నారు.
ఈ దంపతుల కుమార్తె సృష్టిత (21) తల్లితో కలిసి నివసిస్తూ ఉండేది. కుటుంబ పరిస్థితుల వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, శుక్రవారం తన గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
సృష్టిత తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

