ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ మళ్లీ కొత్త చరిత్ర సృష్టించింది. మునుపెన్నడూ లేని స్థాయిలో 1,25,245.57 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతూ ఆల్ టైమ్ రికార్డ్ను నెలకొల్పింది. ఒక్క బిట్‌కాయిన్ విలువ ప్రస్తుతం సుమారు రూ.1.11 కోట్లుగా నమోదైంది.
ఈ ఏడాది ఆగస్టు మధ్యలో నమోదైన పాత రికార్డు 1,24,480 డాలర్లను అధిగమిస్తూ, బిట్‌కాయిన్ వరుసగా ఎనిమిదో సెషన్‌లో కూడా లాభాల బాటలో సాగుతోంది. నేటి మధ్యాహ్నం 2:54 గంటల సమయానికి ఇది ఇంకా 1.55% లాభంతో 1,24,353.96 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
ఎందుకు పెరిగింది బిట్‌కాయిన్ ధర?అమెరికా ప్రభుత్వం క్రిప్టో పెట్టుబడులపై సానుకూల నిబంధనలు తీసుకురావడం.బిట్‌కాయిన్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETF)లో భారీగా నిధులు ప్రవహించడం.
యూఎస్ డాలర్ బలహీనపడటం వల్ల పెట్టుబడిదారులు క్రిప్టో వైపు మళ్లడం.అంతర్జాతీయ స్థాయిలో సంస్థాగత పెట్టుబడులు పెరగడం.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సంస్థ పాకిస్థాన్‌తో క్రిప్టో భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నట్లు వచ్చిన వార్తలు కూడా బిట్‌కాయిన్ మార్కెట్‌లో ఉత్సాహాన్ని పెంచాయి.
విశ్లేషకుల అంచనా ప్రకారం, డాలర్ బలహీనత కొనసాగితే మరియు ETFల ద్వారా నిధుల ప్రవాహం మరింతగా పెరిగితే, బిట్‌కాయిన్ త్వరలోనే 1.3 లక్షల డాలర్ల మార్క్‌ను చేరే అవకాశం ఉంది.
క్రిప్టో మార్కెట్‌లో ఇంత వేగం, ఇంత రికార్డ్.. పెట్టుబడిదారుల జోష్ మళ్లీ మొదలైంది! 🚀

