Tv424x7
Telangana

మెదక్ జిల్లా ప్రజావాణి కార్యక్రమం – 06 ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా స్వీకరించారు..

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ రోజు ప్రజావాణి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ గారు స్వయంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి, ప్రజల నుండి వచ్చిన వినతులు మరియు ఫిర్యాదులను స్వీకరించారు.

జిల్లా నలుమూలల నుండి వచ్చిన పౌరులు తమ సమస్యలను నేరుగా ఎస్పీ గారికి తెలియజేశారు. మొత్తం 06 ఫిర్యాదులను ఎస్పీ గారు స్వయంగా స్వీకరించి, వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ, సంబంధిత పోలీస్ స్టేషన్ల సీనియర్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు వెంటనే చర్యలు తీసుకునేలా సూచనలు ఇచ్చారు.

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, “ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా పోలీస్ అధికారులను సంప్రదించాలి. చట్టబద్ధ పరిష్కారం ద్వారానే ప్రజలకు న్యాయం సాధ్యమవుతుంది. పోలీస్ సిబ్బంది శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత దగ్గరగా ఉండాలి” అని అన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను సమయానికి పరిష్కరించే మెదక్ పోలీస్ శాఖ యొక్క కృషి మళ్లీ హైలైట్ అయింది.

Related posts

విష్ణుమూర్తి మృతి!

TV4-24X7 News

నల్గొండ: గిరిజన రైతుపై థర్డ్ డిగ్రీ దాడి – జాతీయ మానవ హక్కుల కమిషన్ చర్యలకు ఆదేశాలు..

TV4-24X7 News

కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం

TV4-24X7 News

Leave a Comment