జగిత్యాల జిల్లా వార్త:
జగిత్యాల పట్టణంలోని వడ్డెర కాలమటన్లో కారం లేదని తిట్టిన భర్త.. ఆత్మహత్యకు పాల్పడిన భార్య!నీలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఇటీవల లవ్ మ్యారేజ్ చేసుకున్న యువతి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే — గత నెల 26న గంగోత్రి అనే యువతి, సంతోష్ అనే యువకుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. దసరా సందర్భంగా భార్యాభర్తలు అత్తింటికి వెళ్లారు. అక్కడ మటన్ కూర వండుతున్న సమయంలో కూరలో కారం తక్కువగా ఉందని సంతోష్ తన భార్య గంగోత్రిపై కోపంతో తిట్టాడట.
దీంతో మనస్తాపానికి గురైన గంగోత్రి, భర్తతో తగవుల తర్వాత ఇంటికి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఈ ఘటనతో ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

