Tv424x7
Andhrapradesh

ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు నిర్లక్ష్యం: కురుపాం జిల్లాలో బాలికలు కలుషిత నీరు తాగి బలహీనత

పార్వతీపురం జిల్లా కురుపాం గిరిజన బాలికల గురుకుల హాస్టళ్లలో కలుషిత నీరు కారణంగా ఆందోళన. 9, 10 తరగతులు చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ప్రాణాలు కోల్పోయారు. 5వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న 611 మంది బాలికల్లో 140 మంది పచ్చకామెర్లకు గురై జిల్లా కేంద్ర, విశాఖ కెజిహెచ్‌లలో చికిత్స పొందుతున్నారు.

డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ పరిశీలనలో నర్సీపట్నం హాస్టల్‌లో 228 మంది విద్యార్థినులకు ఒక్కే మరుగుదొడ్డి, బాత్రూమ్ ఉండటం, మౌలిక వసతుల లేమి వంటి సమస్యలు వెలుగులోకి వచ్చాయి.

హైకోర్టు మరియు NCPCIR గైడ్‌లైన్స్ ప్రకారం, మౌలిక వసతులను ప్రభుత్వమే కల్పించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ మార్పు లేదు. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి, బాధితుల కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం ప్రకటించారు.

ప్రజా సంక్షేమం కంటే కార్పొరేట్ విధానాల ప్రాధాన్యత ఎక్కువవ్వడం, విద్యార్థుల హక్కులను పక్కన పెట్టడం ప్రభుత్వంపై ప్రశ్నలు రేపుతోంది.

Related posts

ఆగస్టు 15 సందర్భంగా పింగళి వెంకయ్య విగ్రహానికి మహర్దశ

TV4-24X7 News

ఏపీలో వర్షాలపై సీఎం చంద్రబాబు దృష్టి… విదేశాల్లో ఉన్నా రాష్ట్ర ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యం!

TV4-24X7 News

ప్రభుత్వాసుపత్రిలో క్షుద్రపూజల కలకలం

TV4-24X7 News

Leave a Comment