Tv424x7
Andhrapradesh

ఏపీ ప్రభుత్వంపై వెంకయ్య నాయుడు ఘాటు వ్యాఖ్యలు

అమరావతి: మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలపై కఠిన వ్యాఖ్యలు చేశారు.“మహిళలకు ఉచిత బస్సు ప్రయోజనం ఏమిటి?” అని ప్రశ్నిస్తూ,“ప్రభుత్వం విద్య, వైద్య రంగాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఉచితాలు అలవాటు చేస్తే సమాజం నష్టపోతుంది” అని ఆయన హెచ్చరించారు.“విద్యతో పేదవాడు సంపన్నుడయ్యే అవకాశాలు ఉన్నాయి.వైద్యం ప్రతి మనిషికి అవసరమైన హక్కు” అని ఆయన స్పష్టం చేశారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆయన శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.“ఐదేళ్లలో ఎంత అప్పులు చేశారు, ఎంత చెల్లించారు అనే వివరాలు ప్రజలకు వెల్లడించాలి” అన్నారు.అలాగే ఆయన అసెంబ్లీ వ్యవహారాలపై కూడా వ్యాఖ్యానిస్తూ,“సభలో బూతుల సాంప్రదాయానికి తెర వేయాలి. సభలో లేనివారి పట్ల అమర్యాదగా వ్యవహరించకూడదు” అని అన్నారు.

📍 వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Related posts

ట్రావెల్స్‌ బస్సును ఢీ కొట్టిన టిప్పర్‌క్షణాల్లో కమ్మేసిన అగ్నికీలలు

TV4-24X7 News

🫵జనసేనాని చేసిన ముఖ్యమైన సూచనలు🫵

TV4-24X7 News

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఆందోళన.

TV4-24X7 News

Leave a Comment