Tv424x7
Telangana

అత్త డబ్బులు అడిగిందని.. పెనంతో కొట్టి చంపిన కోడలు!

తెలంగాణ

వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో మానవత్వం తలదన్నే ఘటన వెలుగులోకి వచ్చింది. మందులకు, తిండికి డబ్బులు అడుగుతోందని కోపంతో కోడలు అత్తను హత్య చేసింది.

గ్రామానికి చెందిన దొడ్డి ఎల్లమ్మ (వృద్ధురాలు) తన కుమారుడు మల్లయ్య, కోడలు బొగురమ్మతో కలిసి నివసిస్తోంది. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న ఎల్లమ్మ మందులు, తిండికి తరచూ డబ్బులు అడుగుతోందని కోడలు బొగురమ్మకు విసుగు తెప్పించింది. అక్టోబర్ 4న ఇరుగుపొరుగు ఎవరూ లేని సమయంలో బొగురమ్మ అత్తపై పెనంతో, కర్రతో విచక్షణారహితంగా దాడి చేసి అక్కడికక్కడే చంపేసింది.

తర్వాత తన నేరాన్ని దాచేందుకు సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ మృతదేహాన్ని అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా, వీపు భాగంలో గాయాలు గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను నిలదీశారు. చివరికి చేసిన నేరాన్ని బొగురమ్మ ఒప్పుకుంది.

కూతురు బచ్చమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితురాలిని అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన పెనం, కర్రను స్వాధీనం చేసుకున్నారు.

గ్రామస్థులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ — “తల్లి తర్వాత తల్లిలా ఉండే అత్తను ఇంత క్రూరంగా చంపడం మానవత్వానికి మచ్చ” అని వ్యాఖ్యానించారు.

Related posts

సంపన్నుల చేతుల్లో అసైన్డ్ భూములు ఉంటే స్వాధీనమే

TV4-24X7 News

ఈ నెల 15వ తేదీన రాష్ట్రానికి వస్తున్న గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

TV4-24X7 News

చట్టం ఎవ్వరికీ చుట్టం కాకూడదు’.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై హరీశ్ రావు..!!

TV4-24X7 News

Leave a Comment