Tv424x7
National

అమెరికాకు భారత విద్యార్థులు దూరం… భారీగా తగ్గిన వీసాలు

న్యూ ఢిల్లీ

ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులకు గట్టి షాక్ తగిలింది. ఈ ఏడాది ఆగస్టులో అమెరికా ప్రభుత్వం జారీ చేసిన స్టూడెంట్ వీసాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. గతేడాదితో పోలిస్తే 44.5 శాతం తక్కువ వీసాలు జారీ చేయడంతో వేలాది మంది విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది.

ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2024 ఆగస్టుతో పోలిస్తే 2025 ఆగస్టులో అమెరికా జారీ చేసిన మొత్తం అంతర్జాతీయ విద్యార్థి వీసాలు 19.1 శాతం తగ్గాయి. ఇందులో భారత విద్యార్థులపై ప్రభావం అత్యధికంగా పడింది. ఈ ఏడాది చైనాకు 86,647 వీసాలు జారీ కాగా, భారత్‌కు ఆ సంఖ్య దానికి సగం కంటే తక్కువగానే ఉంది.

నిపుణులు ఈ పరిస్థితికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన విధానాలే కారణమని పేర్కొంటున్నారు. వీసా రద్దులు, ఇంటర్వ్యూ నిలిపివేతలు, హెచ్-1బీ వీసా రుసుము పెంపు వంటి చర్యలు భారత విద్యార్థులను గందరగోళానికి గురిచేశాయని వారు చెబుతున్నారు.—

ఫ్రాన్స్ వైపు అడుగులు

అమెరికా తలుపులు మూసేస్తుంటే, మరోవైపు ఫ్రాన్స్ భారతీయ విద్యార్థులకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఫ్రాన్స్‌లో ఉన్నత విద్యను అభ్యసించే భారత విద్యార్థుల సంఖ్య గతేడాదితో పోలిస్తే 17 శాతం పెరిగింది.

ఫ్రాన్స్ రాయబార కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, 2030 నాటికి 30,000 భారత విద్యార్థులను ఆహ్వానించడం లక్ష్యం. ఈ దిశగా ‘చూజ్ ఫ్రాన్స్ టూర్–2025’ పేరుతో ఎడ్యుకేషన్ ఫెయిర్‌లు నిర్వహిస్తున్నారు.

అక్టోబర్ 5న చెన్నైలో, 7న ఢిల్లీలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఇక కోల్‌కతా (అక్టోబర్ 9), ముంబై (అక్టోబర్ 11) నగరాల్లో కూడా ఫ్రాన్స్ యూనివర్సిటీల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ టూర్‌లో 50కి పైగా ఫ్రాన్స్ ప్రముఖ విశ్వవిద్యాలయాలు పాల్గొంటున్నాయి.—

విద్యా నిపుణుల అభిప్రాయం ప్రకారం, అమెరికా వీసా కఠినత వల్ల విద్యార్థులు ఇప్పుడు ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల వైపు మళ్లే అవకాశం ఉందని అంచనా.

Related posts

యాదవ్ ల కంచుకోటలో బీహార్ సీఎం నితీశ్ కు పరిక్ష..!

TV4-24X7 News

చొరబాటుదారులతో దేశానికి ముప్పు..

TV4-24X7 News

మరో 6 నెలల్లో వెండికీ తప్పనిసరి హాల్ మార్కింగ్!!!

TV4-24X7 News

Leave a Comment