Tv424x7
Andhrapradesh

విశాఖలో జగన్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి

విశాఖపట్నం:

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు మాకవరపాలెం మెడికల్‌ కాలేజ్‌ పర్యటనకు విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు.

విమానాశ్రయం నుంచి ఎన్‌ఏడీ – పెందుర్తి – సరిపల్లి – జాతీయ రహదారి – అనకాపల్లి – తాళ్లపాలెం – మాకవరపాలెం మార్గంలో పర్యటనకు అనుమతి లభించింది.

అయితే ఈ పర్యటన సందర్భంగా రూట్‌ మళ్లింపులు, జనసమీకరణ, సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదు అని పోలీసులు స్పష్టం చేశారు.

జగన్‌మోహన్‌రెడ్డి వాహన శ్రేణికి గరిష్ఠంగా 10 వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వబడిందని కమిషనర్‌ తెలిపారు.

నిబంధనలు ఉల్లంఘించినట్లయితే తక్షణమే అనుమతి రద్దు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పర్యటనలో ఏదైనా గాయం, ప్రాణనష్టం లేదా ప్రభుత్వ–ప్రైవేట్ ఆస్తికి నష్టం జరిగితే నిర్వాహకులు వ్యక్తిగతంగా, పరోక్షంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది అని పోలీసులు స్పష్టం చేశారు.

Related posts

డాక్టర్ జహీర్ అహ్మద్ సహకారంతో అన్నదాన కార్యక్రమం

TV4-24X7 News

ఏపీలో కుల ధృవీకరణ పత్రాలు ఇప్పుడు వాట్సాప్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు!!

TV4-24X7 News

14 జిల్లాలకు కొత్త ఎస్పీల నియామకం…

TV4-24X7 News

Leave a Comment