రాష్ట్రంలోని రహదారుల పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. మొత్తం 274 రోడ్డు పనుల కోసం రూ.1000 కోట్లు మంజూరు చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
స్టేట్ హైవేస్ (SHs) విభాగంలో 108 పనులకు రూ.400 కోట్లు కేటాయించారు.
మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ (MDRs) విభాగంలో 166 పనులకు రూ.600 కోట్లు కేటాయించారు.
ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రహదారులు, జిల్లా రోడ్ల మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. రాబోయే నెలల్లో ఈ పనులు వేగంగా ప్రారంభమయ్యే అవకాశముంది.

