Tv424x7
National

పశ్చిమ బెంగాల్‌లో 1000 మంది BLOలకు ఈసీ నోటీసులు!

కొలకతా :పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై కేంద్ర ఎన్నికల సంఘం (EC) పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు వెయ్యి మంది బూత్‌ లెవల్‌ ఆఫీసర్లకు (BLOs) షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

ఎన్నికల సంబంధిత సూచనలను పాటించడంలో విఫలమైనందుకు ప్రజాప్రాతినిధ్య చట్టం–1950 కింద ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ (ERO) పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, సంబంధిత అధికారులు ERO-Net పోర్టల్‌లో తమ వివరాలను నమోదు చేయకపోవడంతో ఈసీ కఠినంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

ఒక సీనియర్‌ అధికారి మాట్లాడుతూ —“పరిపాలనా నిర్లక్ష్యాన్ని ఏ విధంగానూ సహించబోమని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. నిర్లక్ష్యం చేసిన BLOలపై తదుపరి చర్యలు తప్పవు” అని తెలిపారు.

ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై ఈసీ మరోసారి హెచ్చరిక జారీ చేసినట్లు సమాచారం.

Related posts

ఉద్యోగుల‌కు 7 ల‌క్ష‌ల ఆదాయం వ‌ర‌కూ ప‌న్ను మిన‌హాంపు:-కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

TV4-24X7 News

భారత నేవీ చేతికి మరో బ్రహ్మాస్త్రం.. _ త్వరలో చేరనున్న రాఫెల్‌ మెరైన్‌ ఫైటర్‌ జెట్స్..

TV4-24X7 News

భారత ఎన్నికల కమిషన్ (ECI) సంచలన నిర్ణయాలు – బిహార్ ఎన్నికలకు ప్రత్యేకంగా

TV4-24X7 News

Leave a Comment