Tv424x7
Andhrapradesh

బాలికపై అత్యాచార నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకుని ఆత్మహత్య

​తుని (కాకినాడ జిల్లా):కాకినాడ జిల్లా తునిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 8వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు నారాయణరావు, పోలీసుల అదుపు నుంచి తప్పించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.​పోలీసులు అందించిన వివరాల ప్రకారం, నిందితుడు నారాయణరావును నిన్న రాత్రి కోర్టుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో, మార్గమధ్యలో ‘బాత్రూంకు వెళ్లాలి’ అని చెప్పి పోలీసుల కళ్లుగప్పి అతడు పరారయ్యాడు.​అలా తప్పించుకున్న వెంటనే, సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. నిన్న రాత్రి నుంచే గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఉదయం నిందితుడు నారాయణరావు మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

మీ సమీపంలోని సమస్యలు మాకు పంపాలనుకుంటే మా మొబైల్ నెంబర్ : 8686186039

Related posts

పిళ్ళా శివకృష్ణ ను పరామర్శించిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల

TV4-24X7 News

కిడ్నీ రాళ్లకు శస్త్రచికిత్స లేకుండా కొత్త పరిష్కారం!!

TV4-24X7 News

విశాఖలో ఆయిల్ ట్యాంకర్ పై పిడుగు.

TV4-24X7 News

Leave a Comment