కర్నూలు జిల్లా ఉల్లిందకొండ క్రాస్ వద్ద జరిగిన ఘోర ప్రమాదం బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి 19 మంది దుర్మరణం పాలైన ఘటనకు కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఫోరెన్సిక్ టీమ్ ప్రాథమిక నివేదిక ప్రకారం, బస్సులోని లగేజీ క్యాబిన్లో 400కు పైగా మొబైల్ ఫోన్లు ఉన్నట్లు గుర్తించారు. ఇవన్నీ పార్సిల్‌గా తరలిస్తున్నట్టు సమాచారం.అయితే మంటల వేడికి ఫోన్ బ్యాటరీలు ఒక్కొక్కటిగా పేలిపోవడంతో మంటలు మరింత విస్తరించాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు, బస్సు డోర్ దగ్గర ఉన్న చిన్న హైడ్రాలిక్ సిలిండర్ పేలిపోవడంతో డోర్లు తెరుచుకోలేదని విచారణలో తేలింది. దీంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.డ్రైవర్ నిర్లక్ష్యం, అధిక వేగం, లగేజీ లోడ్‌లో ప్రమాదకర వస్తువులు — ఈ మూడూ కలిసి ఈ భయానక దుర్ఘటనకు కారణమయ్యాయని అనుమానిస్తున్నారు. ఘటనపై పూర్తి నివేదిక త్వరలో వెల్లడించనున్నట్లు పోలీసులు తెలిపారు.
previous post

