కడప జిల్లా, మైదుకూరు:చాపాడు మండలం మాడూరు గ్రామానికి చెందిన నవీన్ రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నాడు. పేద కుటుంబం లక్షల రూపాయలు వెచ్చించి వైద్యం చేయించుకోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది.ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి అండగా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ముందుకు వచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 1,22,553 మంజూరు చేయించి, ఆ మొత్తాన్ని నేడు కుటుంబ సభ్యులకు అందజేశారు.అంతేకాకుండా, బాధిత కుటుంబానికి నెలకు రూ. 15,000 పెన్షన్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఎంపీడీఓకు ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన నవీన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఎల్లప్పుడూ కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ తెలిపారు.
previous post
next post

