Tv424x7
Andhrapradesh

ఉరేసుకుని మహిళా లెక్చరర్ ఆత్మహత్య

కడప జిల్లా, పొద్దుటూరు సిటీకడప జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మానసికంగా కుంగిపోయిన ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పొద్దుటూరు సిటీ ఈశ్వర్‌రెడ్డి నగర్‌లో జరిగింది.

చిన్న వయసులోనే తల్లిదండ్రులు మృతిచెందడంతో, ఇద్దరు అక్కాచెల్లెళ్లు తాత వద్ద పెరిగారు. ఇటీవల అక్క కవిత వివాహం జరగగా, చెల్లెలు మహేశ్వరి (26) తాత వద్దే ఉంటూ అతని బాగోగులు చూసుకుంటూ, చాపాడు మండలంలోని ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తోంది.

పేరెంట్స్ లేకపోవడం, అక్కకు పెళ్లయిపోవడంతో ఒంటరిగా ఫీలైన మహేశ్వరి మానసికంగా కుంగిపోయి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై అక్క కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Related posts

మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్ లో తన ఆఫీస్ ని మూసేసింది..!!

TV4-24X7 News

వేదాంత వి.జి.సీ.బి పోర్టు ద్వారా ఉచిత ఉపాధి శిక్షణ పొందిన వారికి నియామక పత్రాలు అందజేత

TV4-24X7 News

డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు..!ఎందుకో తెలుసా..?

TV4-24X7 News

Leave a Comment