దేశంలో వేగంగా పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లుపై సుప్రీంకోర్టు సీరియస్‌గా స్పందించింది.
స్వయంగా సుమోటోగా విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు, ఈ కేసులకు సంబంధించిన FIRలను సమర్పించాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది.
స్కామ్‌ల వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించేందుకు ఈ కేసుల విచారణ బాధ్యతను CBIకి అప్పగించే అంశంపై సుప్రీంకోర్టు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.
దీనికి కావాల్సిన సైబర్ క్రైమ్ నిపుణులు, సాంకేతిక వసతులు అవసరమైతే తక్షణమే తెలియజేయాలని CBIకి సూచించింది.
ఈ వ్యవహారంపై మరింత విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసినట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.

