!నకిలీ లిక్కర్ కేసులో అసలు సూత్రధారిగా భావిస్తున్న మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ రాజకీయంగా దుమారం రేగుతోంది.
నిందితుడు అద్దేపల్లి జనార్ధన్‌రావు ఎవరో తనకు తెలియదని రమేష్ చెప్పినా, ఆ ఇద్దరి మధ్య ఉన్న ఫోటోలు, సాక్ష్యాలు బయటకు రావడంతో కొత్త వివాదం చెలరేగింది.
దుర్గ గుడిలో ప్రమాణం చేసి, “నకిలీ లిక్కర్ స్కామ్‌తో నాకు సంబంధం లేదు” అని రమేష్ స్పష్టం చేశారు.
చంద్రబాబు, లోకేష్‌లకు సవాల్ విసిరి – “నిజం తెలిసేలా దేవాలయంలో ప్రమాణం చేశాను” అని ప్రజల ముందు ప్రకటించారు.
అయితే, అద్దేపల్లి జనార్ధన్‌రావు కస్టడీలో ఇచ్చిన సమాచారం ఆధారంగా, పోలీసులు మరిన్ని వివరాలు బయటపెడుతున్నారని వార్తలు వస్తున్నాయి.
వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో కూడా నకిలీ మద్యం వ్యాపారం జోగి రమేష్ ఆధ్వర్యంలో నడిచిందని అద్దేపల్లి సోదరులు చేసిన ఆరోపణలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చాయి.
రాజకీయ వర్గాలు చెబుతున్నట్టు —జోగి రమేష్ చేసిన హడావుడి, ప్రమాణాలు… అసలు విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నమేమోనన్న అనుమానం పెరుగుతోంది.
ప్రజల్లోనూ “గుమ్మడికాయ దొంగ భుజాలు తడుముకున్నట్లుగా జోగి రమేష్ వ్యవహరిస్తున్నారు” అనే చర్చ మొదలైంది.

