ఇది ఏఐ సృష్టించిన ఫొటోలా కనిపించినా, ఇది నిజమైన ఫోటో అని చెప్పాల్సిందే. ఇటాలియన్ ఫోటోగ్రాఫర్ వాలెరియో మినాటో ఈ అద్భుత దృశ్యాన్ని బంధించడానికి ఆరేళ్లు సమయం తీసుకున్నారు.
చంద్రుడు, పర్వత శిఖరం, బాసిలికా — ఈ మూడు ఒకే సరళ రేఖలో రావడానికి ఆరేళ్లు వేచి చూశారు. చివరికి ఆ క్షణం వచ్చినప్పుడు ఆయన కెమెరా క్లిక్ చేశాడు.
ఈ అరుదైన ఫొటో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు “ఇది ప్రకృతి మరియు సహనానికి ప్రతీక” అని కామెంట్ చేస్తున్నారు.

