Tv424x7
Andhrapradesh

తుఫాను ప్రభావిత 17 జిల్లాల్లో 551 శిబిరాలు సిద్ధం — వైద్య బృందాలు ఫుల్ అలెర్ట్‌లో..

అమరావతి:తుఫాను పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్యారోగ్య శాఖ అత్యవసర చర్యలు చేపట్టింది.

డెలివరీ డేట్‌కు వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్న నిండు గర్భిణీ స్త్రీలను స్థానిక వైద్య అధికారులు గుర్తించి, ఏరియా మరియు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు.

తుఫాను ప్రభావిత 17 జిల్లాల్లో మొత్తం 787 మంది గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రదేశాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.

కృష్ణ జిల్లాలో 240 మంది

ఏలూరు జిల్లాలో 171 మంది

కోనసీమ జిల్లాలో 150 మంది

తూర్పు గోదావరి జిల్లాలో 142 మంది గర్భిణీలు ఆసుపత్రులకు చేరుకున్నట్లు సమాచారం.

గర్భిణీలలో అధిక ప్రమాదం ఉన్నవారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని వైద్యులు తెలిపారు.

551 శిబిరాలు సిద్ధం – వైద్య బృందాలు అలర్ట్‌లోతుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆశ్రయాల్లో 551 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు వైద్యారోగ్య మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రతి శిబిరంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి, ఒక ఏఎన్ఎం, ఆశా కార్యకర్త అందుబాటులో ఉంటారని తెలిపారు.”ప్రజల ఆరోగ్యం, భద్రతకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది” అని మంత్రి సత్యకుమార్ హామీ ఇచ్చారు.

Related posts

పోలీస్ స్టేషన్ ఆవరణంలో వ్యక్తి నగ్నంగా తిరిగిన సంఘటనపై స్పందించిన పోలీసు

TV4-24X7 News

సీఎం చంద్రబాబు కొత్త హెలికాప్టర్ ..?

TV4-24X7 News

10 రోజుల నుంచి పరారీలోనే కాకాణి… పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ

TV4-24X7 News

Leave a Comment