అమరావతి:తుఫాను పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్యారోగ్య శాఖ అత్యవసర చర్యలు చేపట్టింది.
డెలివరీ డేట్‌కు వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్న నిండు గర్భిణీ స్త్రీలను స్థానిక వైద్య అధికారులు గుర్తించి, ఏరియా మరియు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు.
తుఫాను ప్రభావిత 17 జిల్లాల్లో మొత్తం 787 మంది గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రదేశాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
కృష్ణ జిల్లాలో 240 మంది
ఏలూరు జిల్లాలో 171 మంది
కోనసీమ జిల్లాలో 150 మంది
తూర్పు గోదావరి జిల్లాలో 142 మంది గర్భిణీలు ఆసుపత్రులకు చేరుకున్నట్లు సమాచారం.
గర్భిణీలలో అధిక ప్రమాదం ఉన్నవారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని వైద్యులు తెలిపారు.
551 శిబిరాలు సిద్ధం – వైద్య బృందాలు అలర్ట్‌లోతుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆశ్రయాల్లో 551 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు వైద్యారోగ్య మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రతి శిబిరంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి, ఒక ఏఎన్ఎం, ఆశా కార్యకర్త అందుబాటులో ఉంటారని తెలిపారు.”ప్రజల ఆరోగ్యం, భద్రతకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది” అని మంత్రి సత్యకుమార్ హామీ ఇచ్చారు.

