ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలవుతున్న చిన్నారుల భవిష్యత్తు ఏవేరా..?
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం, నేలజర్త ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 126 మంది విద్యార్థులు చదువుకుంటున్నా… ఒక్క టీచర్ కూడా లేకపోవడం స్థానికులను కలవరపెడుతోంది.
గత మూడు నెలలుగా వాలంటీర్ సహాయంతోనే పాఠశాల నడుస్తోందని గ్రామస్థుల వాపో.
పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన.
పిల్లలు చదువుకు దూరం అవుతున్నారన్న ఆందోళనతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే టీచర్లను నియమించాలని జిల్లా కలెక్టర్‌ను కోరుతూ విజ్ఞప్తి చేశారు.

