:
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డ్‌లో హౌస్ సర్జన్‌గా పని చేస్తున్న లేడీ డాక్టర్‌ను ప్రేమ సంబంధం కోరుతూ వేధించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆసుపత్రి సూపరింటెండ్ Dr. K.L. సుబ్రమణ్యం ఇచ్చిన ఫిర్యాదును ఆధారంగా కేసు నమోదు చేయగా, వెంటపడ్డ వ్యక్తిని గుర్తించారు. ఆయన పేరు గిద్దలూరి మోహన్ సాయి, వయసు 27, తండ్రి G. శివ లింగయ్య, నివాసం సిండికేట్ నగర్, అనంతపురం రూరల్. మోహన్ సాయి SSBN కాలేజీ నుండి B.Com పూర్తిచేసి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు.
పోలీసుల వివరాల ప్రకారం, మోహన్ సాయి 13 సెప్టెంబర్ 2024న దగ్గు చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చినప్పుడు డాక్టర్ వద్ద చికిత్స పొందిన తర్వాత ఆమెను వేధించడం ప్రారంభించాడు. ఈ ఉదయం అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

