Tv424x7
Andhrapradesh

కూలిపోబోతున్న ఇంట్లో వృద్ధ దంపతులు అధికారుల సహాయం కోసం ఎదురుచూపులు

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండల పరిధిలోని నీలాపురం గ్రామపంచాయతీకి చెందిన దేవతి దేవేంద్ర మరియు ఆయన భార్య ఎన్నో ఏళ్ల క్రితం మట్టితో నిర్మించిన పాత ఇంటిలో నివసిస్తున్నారు. కాలక్రమేణా ఆ ఇల్లు పూర్తిగా దెబ్బతిని, ఇప్పుడు కూలిపోబోతున్న స్థితికి చేరుకుంది.ఇటీవలి వర్షాల కారణంగా గోడలు చీలి, పైకప్పు కూలిపోవడానికి సిద్ధంగా ఉండడంతో ఈ వృద్ధ దంపతుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. అయినా ఆర్థిక ఇబ్బందుల కారణంగా మరమ్మత్తు చేయించుకోలేక, అదే ఇంట్లో నివసించక తప్పని పరిస్థితి ఏర్పడింది.గ్రామస్థులు మాట్లాడుతూ –“ఈ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఏ క్షణమైనా ప్రమాదం సంభవించే పరిస్థితి ఉంది. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు మరియు అధికారులు వెంటనే స్పందించి, వీరికి పునరావాసం కల్పించి, ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం అందించాలి” అని విజ్ఞప్తి చేశారు.

Related posts

థాంక్యూ ఎమ్మెల్యే సాబ్! నార్త్ కెనాల్‌కు ముందస్తు నీటివిడుదల..

TV4-24X7 News

ఏపీలో గ్రామీణ రహదారుపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

TV4-24X7 News

ఎంపీ, ఎమ్మెల్యే చొరవతో త్వరలో నంద్యాల – చైన్నై బస్సు సర్వీసు ప్రారంభం

TV4-24X7 News

Leave a Comment