రక్తదానం ప్రాణదానంతో సమానమని మైదుకూరు డిఎస్పి రాజేంద్రప్రసాద్ అన్నారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం మైదుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని మైదుకూరు డిఎస్పి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడంతో మనకు తెలియకుండానే ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నామన్నారు. ఆపదలలో రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో మైదుకూరు పట్టణ సీఐ రమణారెడ్డి, రూరల్ సిఐ శివ శంకర్, కాజీపేట సిఐ వంశీధర్, బద్వేల్ అర్బన్ సిఐ లింగప్ప, రూరల్ సీఐ కృష్ణయ్య, ఎస్సై చిరంజీవి ఎస్సై సుబ్బారావు, ఏఎస్ఐ రాంభూపాల్ రెడ్డి ,సబ్ డివిజన్ పరిధిలోని ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
next post

