“కృష్ణంరాజు ముఖం చూసి ప్రభాస్‌ను వదిలేయమంది నా భార్య.. చాలా హర్ట్ అయ్యా” – నిర్మాత ఎంఎస్ రాజు సంచలన వ్యాఖ్యలు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కానీ తన కెరీర్ ప్రారంభ రోజుల్లో జరిగిన ఓ ఆసక్తికర ఘటనను ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.ప్రభాస్‌కు తొలి భారీ హిట్‌గా నిలిచిన వర్షం సినిమా మొదలయ్యే సమయంలో ఓ చిన్న అపార్థం ఇద్దరి మధ్య పెద్ద దూరం తీసుకువచ్చిందట. ఒక్కడు లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వర్షం సినిమాను ప్రారంభించిన ఎంఎస్ రాజు, దర్శకుడిగా శోభన్‌ను ఎంపిక చేశారు. అయితే ఆ నిర్ణయంపై ప్రభాస్ సందేహం వ్యక్తం చేశాడని, “శోభన్‌ను తీసుకోవడం సరైన నిర్ణయమేనా?” అని రెండు మూడు సార్లు అడగడంతో తాను చాలా హర్ట్ అయ్యానని ఎంఎస్ రాజు తెలిపారు.“ఆ మాట నాకు బాధ కలిగించింది. కోపంతో ‘ప్రభాస్, మనం ఇంకో సినిమా చేద్దాం లే’ అని చెప్పి వెళ్లిపోయా. రెండు మూడు రోజులు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు,” అని ఎంఎస్ రాజు గుర్తు చేసుకున్నారు.ఆ తర్వాత ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు ఫోన్ చేసి, “మా అబ్బాయి తెలియక ఏదో అన్నాడు, పట్టించుకోవద్దు” అని చెప్పారట. అనంతరం ప్రభాస్ స్వయంగా ఎంఎస్ రాజు ఇంటికి వెళ్లి మాట్లాడగా, అప్పటికీ నిర్మాత పూర్తిగా కన్విన్స్ కాలేదట.అయితే కథలో ట్విస్ట్ అక్కడే వచ్చిందని ఎంఎస్ రాజు చెప్పారు. “నా భార్య నన్ను పక్కకు పిలిచి.. ‘ప్రభాస్ చిన్నవాడు, కృష్ణంరాజు గారి ముఖం చూసి వదిలేయండి. అతనితో సినిమా చేయండి’ అని చెప్పింది. ఆ తర్వాతే మళ్లీ అన్నీ సెట్ అయ్యాయి,” అని వెల్లడించారు.అలా మొదలైన వర్షం సినిమా ప్రభాస్ కెరీర్‌ను మలుపుతిప్పడమే కాదు.. నిర్మాత ఎంఎస్ రాజు, ప్రభాస్ మధ్య మంచి అండర్‌స్టాండింగ్‌కు కూడా కారణమైందని ఆయన తెలిపారు.
మీ సమీపంలోని సమస్యలు మాకు పంపాలనుకుంటే మా మొబైల్ నెంబర్ : 8686186039

