Tv424x7
Andhrapradesh

శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల నిర్వహణ కేబీఆర్‌ఎంబీ అప్ప‌గింత

శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల నిర్వహణకు కేబీఆర్‌ఎంబీకి అప్పగిస్తూ ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. ప్రాజెక్టులపై కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం గురువారం సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల ఆపరేషన్‌కు ఏపీ, తెలంగాణ ఒప్పుకున్నాయి.

నీటి వాటాల పంపకం కోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయనున్నారు. వాటాల కేటాయింపుపై త్రిసభ్య కమిటీనే తుది నిర్ణయంగా ఉండనున్నది. ఈ సందర్భంగా తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ మాట్లాడుతూ ప్రాజెక్టుల ఆపరేటింగ్ అంతా కేఆర్‌ఎంబీకి ఇచ్చినట్లు తెలిపారు. పవర్ స్టేషన్స్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. నాగార్జున సాగర్ తెలంగాణ, శ్రీశైలం వైపు ఏపీ చూసుకుంటుందని, ప్రాజెక్టులన్నీ ఇక నుంచి బోర్డు పరిధిలో నడుస్తాయని తెలిపారు.

Related posts

నంద్యాలలోని సమస్యలన్ని సమూలంగా పరిష్కరిస్తాం

TV4-24X7 News

అర్థంతరంగా ‘రాజధాని ఫైల్స్‌’ నిలిపివేత..

TV4-24X7 News

ట్రావెల్స్ బస్సు బోల్తా.. 20 మంది గాయాలు

TV4-24X7 News

Leave a Comment