Tv424x7
Andhrapradesh

ఆర్వో సీల్ లేకున్నా పోస్టల్‌ బ్యాలట్లు తిరస్కరించవద్దు: ఈసీ

అమరావతి : రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) సీల్‌ లేకున్నా పోస్టల్‌ బ్యాలట్లను తిరస్కరించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈసీ మార్గదర్శకాలను అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు సీఈవో ముకేశ్‌కుమార్‌ మీనా పంపించారు. ‘‘ఆర్వో సంతకం ఉన్న పోస్టల్ బ్యాలట్లు చెల్లుబాటు అవుతాయి. ఫామ్‌ 13ఏపై ఆర్వో సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలి. ఆర్వో సంతకం సహా బ్యాలట్‌ను ధ్రువీకరించే రిజిస్టర్‌తో సరిపోల్చుకోవాలి. ఫామ్‌ 13ఏలో ఓటరు, ఆర్వో సంతకం, బ్యాలట్‌ సీరియల్‌ నంబర్‌ లేకుంటే వాటిని తిరస్కరించవచ్చు’’ అని ఈసీ స్పష్టం చేసింది.

Related posts

ఆదాయం దోచేసిన నువ్వు మద్యం పాలసీ గురించి మాట్లాడుతున్నావా జగన్ ? మద్య నిషేధం అని చెప్పి పాలసీలు మార్చి దోచేశారు

TV4-24X7 News

కన్న కూతురు బిడ్డనే ఎత్తుకెళ్లిన తాత – తాగుడుకు బానిసై దిగజారిన పెద్దరికం

TV4-24X7 News

నారా లోకేష్ కర్మలను సోషల్ మీడియాలో ప్రశంసలు…

TV4-24X7 News

Leave a Comment