Tv424x7
Andhrapradesh

గోవధ జరగకుండా చూడాలని హైకోర్టు ఆదేశాలు..

బక్రీద్ సందర్భంగా గోవధ జరగకుండా చూడాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. గోవులను అక్రమంగా చంపితే చర్యలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.బక్రీద్ సందర్భంగా గోవధ జరగకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. గోవధ జరగకుండా చూడాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గోవులను అక్రమంగా చంపితే చర్యలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గోవులను తరలించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలిపింది. జంతు వధ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. మూడు కమిషనరేట్ల పరిధిలో 150 చెక్ పోస్టులు పెట్టామని పోలీసులు తెలిపారు. గోవుల తరలింపుపై ఇప్పటికే 60 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గోవధ నిషేధ చట్టం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

Related posts

విజయవాడ BRTS రోడ్డులో ఉద్రిక్తత…. ఏంటో తెలుసా.

TV4-24X7 News

ఇకపై గుర్తింపు కార్డు లేకుండానే ఫ్రీ బస్సు జర్నీ…

TV4-24X7 News

ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి జీవనజ్యోతి భీమా పంపిణి

TV4-24X7 News

Leave a Comment