Tv424x7
Andhrapradesh

శ్రీ శ్రీ యోగి నాగేంద్ర స్వామి ఆలయంలో ఉన్న జ్యోతిర్లింగాలను దర్శించుకున్న వివేకానంద ఆశ్రమ వాసులు

విశాఖపట్నం కైలాసగిరి, విశాలాక్షి నగర్ దగ్గర ఉన్న శ్రీ యోగి నాగేంద్ర స్వామి ఆలయంలో ద్వాదశి సందర్భంగా, జ్యోతిర్లింగాలను దర్శించుకున్న శ్రీ స్వామి వివేకానంద ఆశ్రమ వాసులు, అనంతరం యోగి ప్రభాకర్ వర్ధన్ స్వామీజీని దర్శించుకుని స్వామీజీ ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వివేకానంద సంస్థ అధ్యక్షులు అప్పారావు మాట్లాడుతూ, హిమాలయాల్లో తపస్సు చేసుకొని హిమాలయాల నుంచి వచ్చిన యోగి ప్రభాకర్ వర్ధన్ స్వామిని దర్శించుకుని, ఆయన ఆశీస్సులు తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని, మా ఆశ్రమ వాసులకు ఆయన ఆశీస్సులు ఉండాలని, వారికి ఆయన దర్శన భాగ్యం కలిగినందుకు, సంతోషం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మికంగా భక్తి భావనలతో పూజలు నిర్వహించుకుని, అనంతరం బీచ్ లో ఆశ్రమ వాసులు అల్పాహారం సేవించి ఆనందంగా కాసేపు గడిపారు. ఈ పూజా కార్యక్రమంలో సంస్థ ఆశ్రమ వాసులు, సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

పని గంటల పెంపు బిల్లును ఉపసంహరించాలి – సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్నంద్యాల

TV4-24X7 News

అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి

TV4-24X7 News

చంద్రబాబు, పవన్ కు ప్రభుత్వ మద్యం షాప్ ఉద్యోగుల లేఖ

TV4-24X7 News

Leave a Comment