Tv424x7
Andhrapradesh

పులివెందులలో కీలక పరిణామం… టీడీపీలో చేరిన వైసీపీ నేత

పులివెందులలో వైసీపీకి చెక్ పెట్టేలా టీడీపీ అడుగులుబలం ఉన్న వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకునేలా వ్యూహంఈరోజు టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్ షాహిదాఇప్పటికే ఏపీలోని పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పులివెందుల మున్సిపాలిటీపై దృష్టి సారించింది. జగన్ అడ్డాలో ఆయన ఆధిపత్యానికి చెక్ పెట్టేలా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా బలమైన వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకోవడానికి లోకల్ కేడర్ సిద్ధమయింది. స్థానికంగా ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పార్టీ హైకమాండ్ కు తెలియజేస్తోంది. తాజాగా పులివెందుల మున్సిపాలిటీలోని 30వ వార్డు వైసీపీ కౌన్సిలర్ షాహిదా టీడీపీలో చేరారు. ఆమెతో పాటు వైసీపీ మద్దతుదారులైన 20 కుటుంబాలు ఈరోజు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. త్వరలోనే మరింత మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.

Related posts

విజయ్ వీడియోకు డీఎంకే ఘాటు కౌంటర్

TV4-24X7 News

ఏపీలో సర్పంచ్, MPTC ఎన్నికలు, కీలక అప్డేట్

TV4-24X7 News

బెజవాడలో అర్థరాత్రి నడిరోడ్డుపై ఇద్దరు కానిస్టేబుల్స్ ఫైట్..

TV4-24X7 News

Leave a Comment